ETV Bharat / business

వరుసగా 13వ సారి అపర కుబేరుడిగా ముకేశ్ - దేశంలో టాప్ 10 అత్యంత ధనవంతులు

దేశంలో అత్యంత సంపన్నుడిగా 13వ సారి ముకేశ్ అంబానీనే నిలిచారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన తాజా నివేదికలో ముకేశ్ సంపద 88.7 బిలియన్ డాలర్లుగా తేలింది. ముకేశ్ అంబానీ తర్వాత తొలి పది స్థానాల్లో ఉన్న సంపన్నుల వివరాలు ఇలా ఉన్నాయి.

MUKESH WEALTH
అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముకేశ్
author img

By

Published : Oct 8, 2020, 6:52 PM IST

Updated : Oct 8, 2020, 8:18 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. వరుసగా 13వ ఏట దేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. 'ఫోర్బ్స్‌ ఇండియా టాప్ 100 రిచ్​ లిస్ట్​ 2020'లో ముకేశ్ అగ్రస్థానంలో ఉన్నారు.

ఫోర్బ్స్‌ ప్రకారం ముకేశ్ సంపద గత ఏడాదితో పోలిస్తే 73 శాతం పెరిగి 88.7 బిలియన్ డాలర్లకు చేరింది.

కరోనా వైరస్ దేశాన్ని కుదిపేసినా.. దేశంలో తొలి 100 మంది సంపన్నుల్లో సగం మందికిపైగా ధనవంతుల సంపద భారీగా పెరిగినట్లు ఫోర్స్బ్ నివేదిక పేర్కొంది. వీరందరి సంపద విలువ సంయుక్తంగా 14 శాతం పెరిగి 517.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించింది.

ముకేశ్ తర్వాత తొలి పది స్థానాలు వీరివే..

  1. గౌతమ్ అదానీ (అదానీ గ్రూప్)-25.2 బిలియన్ డాలర్లు
  2. శివ్ నాడార్ (హెచ్​సీఎల్​టెక్)-20.4 బిలియన్ డాలర్లు
  3. రాధా కృష్ణ దమానీ (అవెన్యూ సూపర్​మార్ట్​)-15.4 బిలియన్ డాలర్లు
  4. హిందుజా సోదరులు (హిందుజా గ్రూప్)-12.8 బిలియన్ డాలర్లు
  5. సైరస్ పూనావాలా (సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియా')-11.5 బిలియన్ డాలర్లు
  6. పల్లోంజి మిస్త్రీ (షాపూర్జీ పల్లోంజీ గ్రూప్)-11.4 బిలియన్ డాలర్లు
  7. ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్)-11.3 బిలియన్ డాలర్లు
  8. గోద్రెజ్ కుటుంబం (గోద్రెజ్ గ్రూప్)-11 బిలియన్ డాలర్లు
  9. లక్ష్మీ మిత్తల్ (ఆర్సెలార్ మిత్తల్)-10.3 బిలియన్ డాలర్లు
  10. సునీల్​ మిత్తల్ (భారతీ ఎయిర్​టెల్)-10.2 బిలియన్ డాలర్లు

ఇదీ చూడండి:'500 బిలియన్ డాలర్లకు భారత్- అమెరికా వాణిజ్యం!'

Last Updated : Oct 8, 2020, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.