ETV Bharat / business

లాక్​డౌన్​లో ఏ మొబైల్​ గేమ్​ ఎక్కువగా ఆడుతున్నారు? - ప్రభుత్వాలు

కరోనా ధాటికి పలు దేశాల్లో లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఈ తరుణంలో ఇంట్లో ఖాళీగా ఉన్నవారు ఫోన్ల వినియోగం పెంచేశారు. ఇందులో భాగంగా గేమ్స్​ డౌన్​లోడ్ 20 శాతం పెరిగిందని వెల్లడించింది యాప్ ర్యాంకింగ్​ డేటా.

Mobile Game Downloads Grew 20 Percent Amidst Coronavirus Lockdown
లాక్​డౌన్ ఎఫెక్ట్​: ఫోన్లలో 20 శాతం పెరిగిన​ గేమ్స్ డౌన్లోడ్స్
author img

By

Published : Apr 7, 2020, 1:00 PM IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్​డౌన్​ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి అన్ని దేశాల ప్రభుత్వాలు. దీనివల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కువ సమయం ఇంట్లో ఉండడం వల్ల విసుగుచెందకుండా ఉండేందుకు అధికంగా ఫోన్లను వాడుతున్నారు. ఇందులో భాగంగానే ప్లేస్టోర్​, యాప్​స్టోర్​లను ఉపయోగించి ఎక్కువగా గేమ్​లను డౌన్​లోడ్ చేస్తున్నారు. దీనివల్ల గేమ్​ల డౌన్​లోడింగ్ 20 శాతం పెరిగిందని వెల్లడించింది యాప్​ ర్యాంకింగ్​ డేటా. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే..20 శాతం పెరిగిందని, చివరి త్రైమాసికంతో చూస్తే ఇది 30 శాతంగా ఉందని తెలిపింది. ఈ విశ్లేషణ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 13 బిలియన్ల గేమ్​లు

ప్రపంచవ్యాప్తంగా గూగుల్​ ప్లేస్టోర్​, యాప్​ స్టోర్​లను ఉపయోగించి 13 బిలియన్ల గేమ్​లను డౌన్​లోడ్​ చేశారు. ఇందులో అత్యధికంగా గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి 10 బిలియన్ల గేమ్​లు డౌన్​లోడ్ అయ్యాయి. మిగిలిన 3 బిలియన్లు యాప్​ స్టోర్​ను ఉపయోగించి పొందారు.

భారత్​, బ్రెజిల్​లోనే అధికం

గూగుల్​ ప్లేస్టోర్​ను ఉపయోగించి ఎక్కువ శాతం భారత్​, బ్రెజిల్​లోనే గేమ్స్​ డౌన్​లోడ్ చేశారు. వీటిలోనూ అధికంగా పజిల్స్​, సిమ్యులేషన్​, యాక్షన్​ వంటి శైలిలో ఉన్న ఆటల్నే ఎక్కువగా ఎంచుకున్నారు. యాప్ స్టోర్​ను ఉపయోగించి చైనా, అమెరికాల్లో యాక్షన్, సిమ్యూలేషన్​ శైలిలో ఉన్న వాటికి మొగ్గుచూపారు.

ఎక్కువగా డౌన్​లోడ్ చేసినవి ఇవే..

ప్లే స్టోర్​, యాప్​ స్టోర్​లను ఉపయోగించి ఎక్కువగా బ్రెయిన్ అవుట్​, హంటర్ అస్సాసిన్​​, ఉడ్​టర్నంగ్​ గేమ్స్​ను అధికంగా డౌన్​లోడ్​ చేశారు. వీటితో పాటు వినియోగదారులు వారి సమయాన్ని ఎక్కువగా కేటాయించే క్రీడల్లో గేమ్ ఫర్​ పీస్​, హానర్​ ఆఫ్​ కింగ్స్, మాన్​స్టర్​ స్రైక్​ ఉన్నాయి.

నెలవారీ యాక్టివ్​ వినియోగదారుల్లో.. పబ్​జీ మొబైల్​, క్యాండీ క్రష్​ సాగా, హానర్​ ఆఫ్​ కింగ్స్​ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

వినియోగదారులు వివిధ యాప్​ల కోసం.. 16.7 బిలియన్​ డాలర్లకు పైగా ఖర్చు చేశారు. ఒక త్రైమాసికంలో ఇంత మొత్తం కేటాయించడం ఇదే తొలిసారి. గూగుల్​ ప్లే స్టోర్​ ద్వారా 85 శాతం, యాప్​ స్టోర్​ ద్వారా 65 శాతం వెచ్చించారు. జపాన్​, దక్షిణ కొరియా, అమెరికా​లు గూగుల్​ ప్లేస్టోర్​లో ఎక్కువ ఖర్చు చేయగా, చైనా యాప్​ స్టోర్​ను వినియోగించింది.

ఇదీ చదవండి: 'రోగ నిరోధక శక్తిని పెంచే మహారాజ పోషకాలు ఇవే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.