ETV Bharat / business

ఎస్​ఎంబీల కోసం మైక్రోసాఫ్ట్​​ 'బ్యాక్​2బిజినెస్'​

author img

By

Published : May 14, 2020, 3:52 PM IST

చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల కోసం 'బ్యాక్​2బిజినెస్ సొల్యూషన్'​ సేవలను ప్రారంభించింది ప్రముఖ సాఫ్ట్​వేర్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​. కరోనా సంక్షభంలో వ్యాపార నిర్వహణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఈ క్లౌడ్ అప్లికేషన్​ను రూపొందించింది.

Microsoft introduces Back2Business
ఎస్​ఎంబీల కోసం మైక్రోసాఫ్ట్​​ 'బ్యాక్​2బిజినెస్'​ సొల్యూషన్​

కరోనా సంక్షోభంలో వ్యాపార నిర్వహణను సజావుగా కొనసాగించడంలో అనేక సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను(ఎస్​ఎంబీలు) దృష్టిలో ఉంచుకుని 'బ్యాక్​2బిజినెస్​ సొల్యూషన్​ బాక్సెస్'​ క్లౌడ్​ సేవలను ప్రారంభించింది ప్రఖ్యాత సాఫ్ట్​వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్​.

వ్యాపార సంస్థల పరిమాణం ఆధారంగా వీటిని నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్​లోని ఎస్​ఎంబీలు ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకలాపాలను కొనసాసాగించే విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, రిమోట్​ వర్క్​​ సొల్యూషన్​, అధునాతన భద్రత, పరికరాల నిర్వహణ, వంటి సదుపాయాలతో వ్యాపార కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించేందుకు వీటిని రూపొందించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది మైక్రోసాఫ్ట్​. వీటితో కార్యాలయాలపై నిర్వహణ భారం తగ్గడమే కాక, ఉద్యోగుల ఉత్పాదకత, వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొంది. అజ్యూర్​, అధునాతన యాప్​ల ద్వారా సంస్థలు క్లౌడ్ సేవలను వినియోగించుకోవడం సులభతరమవుతుందని స్పష్టం చేసింది.

నాలుగు వేరియంట్లలో

స్టార్టర్​: చిన్న వ్యాపార సంస్థలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. రిమోట్​ వర్కింగ్​, సురక్షిత వాతావరణం, సహకర పరిష్కారం అవసరమయ్యే సంస్థలకు ఉది ఉపయోగకరం.

బూస్టర్: మధ్య తరహా వ్యాపార సంస్థలకు ఇది ఉపయోగకరం. ఆన్​లైన్​, డెస్క్​టాప్ అప్లికేషన్స్, వినియోగదారులతో సంబంధాలు, బ్యాకప్ సర్వీస్​, రికవరీ సిస్టం అవసరమైన వారి కోసం దీనిని రూపొందించారు.

మోడర్న్ బిజినెస్​: సాధారణ భద్రతతో పాటు ప్రాడక్టివిటీ సూట్​ అవసరమయ్యే ఎస్​ఎంబీల కోసం.

అడ్వాన్స్​డ్​: అధునాతన భద్రతా సామర్థ్యం, ఖర్చు తగ్గింపు, మెరుగైన మౌలిక సదుపాయాల నిర్వహణ కోరుకునే ఎస్​ఎంబీలకు ఈ వేరియంట్​ ఉపయోగకరం.

మైక్రోసాఫ్​ భాగస్వాములకు వీటిలో అదనపు సౌలభ్యాలను కల్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.