ETV Bharat / business

ఒమిక్రాన్​ వార్తలు, ఆర్​బీఐ అంచనాలే స్టాక్ మార్కెట్లకు కీలకం!

Market Outlook Next Week: ఈ వారం స్టాక్ మార్కెట్లకు ఆర్​బీఐ సమీక్ష అంచనాలతో పాటు కరోనా కొత్త వేరియంట్​ అయిన ఒమిక్రాన్​కు సంబంధించిన వార్తలు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత వారం మిశ్రమంగా కదిలాడి.. చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఈ సారి తేరుకుంటాయా? లేదా? అనే విషయంపై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు.

MARKET OUTLOOK
మార్కెట్​ అవుట్​ లుక్​
author img

By

Published : Dec 5, 2021, 12:52 PM IST

Market Outlook Next Week: ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, ఒమిక్రాన్​కు సంబంధించిన వార్తలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు కీలకం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వారం కూడా సూచీలు కొంత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆర్​బీఐ పాలసీతో పాటు స్థూల ఆర్థిక గణాంకాల ప్రకటన కూడా ఈ వారం.. మార్కెట్లను ప్రభావితం చేయనుంది. మదుపురులు వీటిపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు.

"ఒమిక్రాన్​ వార్తలు, ఆర్​బీఐ క్రెడిట్​ పాలసీ, స్థూల ఆర్థిక గణాంకాలు మధ్య ఈ వారం మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా వైరస్​ వ్యాప్తికి సంబంధించిన వార్తలు మార్కెట్​ అస్థిరతకు కారణం కావచ్చు. దేశీయంగా చూస్తే.. ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధానంపై కూడా మార్కెట్ల తీరు ఆధారపడి ఉంటుంది. ఈ మీటింగ్​ ఈ 8వ తేదీన షెడ్యూల్​ అయ్యింది. వీటితో పాటు ద్రవ్యోల్భణ సమాచారం కూడా ప్రభావం చూపనుంది."

-సంతోష్ మీనా, రీసెర్చ్​ హెడ్​ స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్

దేశంలో ఒమిక్రాన్​ తొలి కేసు నమోదైన నేపథ్యంలో భారతీయ స్టాక్​మార్కెట్లు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇది ఈ వారం సైతం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

"ఈ వారంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. కొవిడ్​తో పాటు దేశీయంగా సీపీఐ ద్రవ్యోల్భణం, స్థూల ఆర్థిక గణాకాల ప్రకటన ఉంటుంది. దీనితో పాటు ఆర్​బీఐ ద్రవ్యపరపతి సమీక్ష కూడా మార్కెట్​ను దిశానిర్దేశం చేస్తుంది. "

- అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్

గత వారం బీఎస్​ఈ సెన్సెక్స్​ సుమారు 589 పాయింట్లకు పైగా కోల్పోయింది.

ఇవీ చూడండి:

Skyroot Aviation: ప్రైవేటు రంగంలో తొలిసారిగా.. ఆకాశానికి రాకెట్లు!

Cryptocurrency News: క్రిప్టో కుదేల్‌.. బిట్‌ కాయిన్‌, ఈథర్‌ ధరలు డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.