ETV Bharat / business

భారీ నష్టాల దిశగా మార్కెట్లు- 13,450 దిగువన నిఫ్టీ - సెన్సెక్స్

stocks live updates
స్టాక్​ మార్కెట్లు లైవ్
author img

By

Published : Dec 10, 2020, 9:31 AM IST

Updated : Dec 10, 2020, 9:54 AM IST

09:47 December 10

46,800 దిగువన సెన్సెక్స్..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 340 పాయింట్లకుపైగా కోల్పోయి 45,762 దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకుపైగా పడిపోయి 13,413 వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

  • మారుతీ, నెస్లే, టైటాన్​ మినహా.. 30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి.
  • అల్ట్రాటెక్, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, ఎం&ఎం, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ట్రేడవుతున్నాయి.

09:06 December 10

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్ల రికార్డు స్థాయి లాభాలకు అడ్డుకట్ట పడింది. గురువారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి సూచీలు. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 170 పాయింట్లు కోల్పోయి 45,936 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 50 పాయింట్లకుపైగా తగ్గి 13,474 వద్ద కొనసాగుతోంది.

ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఐటీ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • మారుతీ, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, ఎల్​&టీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు ఒడుదొడుకుల్లో ఉన్నాయి.

Last Updated : Dec 10, 2020, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.