దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ కార్ల ధరలు(Mahindra cars price) భారీగా పెంచింది. కొత్త ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయని డీలర్ల ద్వారా తెలిసింది. ఈ ఏడాది ఇప్పటి వరకే ధరలు పెంచడం ఇది మూడో సారి. తొలుత ఫిబ్రవరిలో, తర్వాత మే ఓసారి.. ఇప్పుడు మరోసారి ధరలు పెంచింది మహీంద్రా.
థార్ ధర రికార్డు స్థాయిలో పెంపు..
ఇతర అన్ని మోడళ్లతో పోలిస్తే.. సరికొత్త థార్ ధరను(Mahindra thar price) అత్యధికంగా(వేరియంట్ల వారీగా) రూ.32 వేల నుంచి రూ.92 వేల వరకు పెంచింది మహీంద్రా. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ధర పెరగటం ఇదే ప్రథమని డీలర్లు చెబుతున్నారు.
ఇతర మోడళ్ల ధరల పెంపు ఇలా..
- ఆల్ట్రస్ జీ4-రూ.3,356
- బొలేరో-రూ.22,452-రూ.22,508
- మరాజో రూ.రూ.26,597-రూ.30,867
- స్కార్పియో రూ.27,211, 37,395
- ఎక్స్‌యూవీ 300 రూ.3,606-రూ.24,029
- ఎక్స్‌యూవీ 500 రూ.3,062-రూ.3,068
ఇదీ చదవండి: