కరోనా వల్ల ప్రజారవాణా కంటే సొంతవాహనాలకే అధికశాతం మొగ్గుచూపుతున్నారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్నవారు కార్లు కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదు. వీరిలో చాలామంది ఆకర్షణీయంగా ఉండే ఎస్‌యూవీలను కోరుకుంటున్నారు. భారతీయ పరిస్థితులకు సరిపోయే విధంగా ఉండటంతో పాటు లగ్జరీ లుక్, సామర్థ్యమే దీనికి కారణంగా కనిపిస్తోంది.
ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయా వాహన కంపెనీలు సైతం పలు రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చాయి. స్థాయికి తగ్గట్లు మోడళ్లు ఉండే విధంగా చూసుకుంటున్నాయి. బడ్జెట్ ధరల్లో ఉన్న ఉత్తమ ఎస్‌యూవీల వివరాలు మీకోసం..
రెనో కైగర్..
- ఫిబ్రవరిలో రెనో కైగర్ భారతదేశ మార్కెట్లోకి విడుదలైంది. ఇది ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్-టీ, ఆర్ఎక్స్-జెడ్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి రూ.10.08 లక్షల వరకు ఉంది. 999 సీసీ పెట్రోల్ ఇంజిన్ దీనికి ఉంది.
- 1.0 లీటర్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ వెర్షన్లలో కైగర్ లభిస్తుంది. 1.0 లీటర్ ఇంజిన్‌లో 5 స్పీడ్ ఆటో, మ్యానువల్ మోడ్లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వెర్షన్లో కేవలం మ్యానువల్ మోడ్ మాత్రమే ఉంది.
- ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌లు, వైర్లెస్ ఛార్జింగ్, 8ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ ప్లే, స్టార్-స్టాప్ పుష్ బటన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ పీఎం 2.5 ఎయిల్ ఫీచర్లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి.
ఇదీ చదవండి: అదిరే లుక్‌తో హ్యుందాయ్ 7 సీట్ల అల్కజార్
నిస్సాన్ మాగ్నైట్
- మాగ్నైట్ ధర రూ.5.59 లక్షల నుంచి రూ.10.00 లక్షల వరకు ఉంది. 999 సీసీ ఇంజిన్‌తో ఉన్న ఈ ఎస్యూవీ.. ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వీ, ఎక్స్‌వీ ప్రీమియం, ఎక్స్‌వీ ప్రీమియం(ఓ) వేరియంట్లలో లభిస్తుంది. సీటింగ్ కెపాసిటీ 5 కాగా.. కేవలం పెట్రోల్ వేరియంట్‌ను మాత్రమే నిస్సాన్ విడుదల చేసింది.
- 1.0 లీటర్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వర్షన్ ఇంజిన్ ఆప్షన్ తీసుకోవచ్చు. 1.0 లీటర్ కేవలం మ్యానువల్ గేరింగ్ ట్రాన్స్మిషన్ ఉండగా... టర్బో పెట్రోల్ వెర్షన్లో సీవీటీ ఆఫ్షన్ కూడా ఉంది. 8ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, వైర్‌లెెస్ ఆండ్రాయిడ్ ఆటో-యాపిల్ కార్ ప్లే, 16 ఇంచుల డ్యుయల్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఈ వాహనంలో ఉన్నాయి.
- ఎక్స్-వీ, ఎక్స్-వీ ప్రీమియంలు వైర్లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, హై ఎండ్ జేబీఎల్ స్పీకర్లు, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్స్, యాంబియెంట్ లైటింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: వచ్చే నెల నుంచి కొత్త కార్ల సందడి షురూ!
టాటా నెక్సాన్
- నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.19 లక్షలు కాగా.. రూ.12.95 లక్షల వరకు వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. టాటా మోటార్స్ నుంచి వచ్చిన కార్లలో విజయవైంతమైన మోడల్ ఇది. 1199-1497 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో.. మొత్తం 18 వేరియంట్లలో లభిస్తుంది.
- 1.2 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్లలో అందుబాటులో ఉంది. రెండిట్లోనూ 6 స్పీడ్ మ్యానువల్ లేదా ఆటోమేటిక్ వెర్షన్లలో ఉన్నాయి. 7ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటోప్లే, యాపిల్ కార్ ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, రియల్ ఏసీ వెంట్స్‌తో కూడిన ఆటో ఏసీ సదుపాయాలు ఉన్నాయి. డ్యుయల్ ఫ్రంట్ ఏయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్పీ లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్ యూవీ 300
- ఎక్స్‌యూవీ 300 ధర రూ.7.95-రూ.13.09 లక్షల మధ్య ఉంది. 1197-1497 సీసీ ఇంజిన్‌తో వస్తోన్న ఈ వాహనం డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8, డబ్ల్యూ8(ఓ) వేరియంట్లలో లభిస్తుంది. ఐదు సీట్ల సామర్థ్యం ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
- 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లను ఎంచుకోవచ్చు. రెండు ఇంజిన్లకు కూడా ఆటోమేటిక్, మ్యానువల్ ట్రాన్స్మిషన్ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, 7ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, రెయిన్(rain) సెన్సింగ్ వైపర్స్, ఆటో ఏసీ సదుపాయాలు ఉన్నాయి. ఏడు ఎయిర్ బ్యాగ్‌లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
మారుతీ సుజుకీ విటారా బ్రెజా
- మారుతీ సుజుకీ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో బ్రెజా ఒకటి. దీని ధర రూ.7.51-రూ.11.41 లక్షల వరకు ఉంది. 1462 సీసీ ఇంజిన్ దీనికి ఉంది. ఐదు సీటర్ల సామర్థ్యంతో.. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లలో లభిస్తోంది.
- 5 స్పీడ్ మ్యానువల్ లేదా 4 స్పీడ్ ఏఎంటీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. క్రూజ్ కంట్రోల్, హైట్ అడ్జెస్టేబుల్ డ్రైవర్ సీట్, ఆటో ఏసీ, 7ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో-యాపిల్ కార్ ప్లే, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రత పరంగా డ్యుయల్ ఫ్రంట్ ఏయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇవీ చదవండి: Yamaha: ఎఫ్‌జెడ్-ఎక్స్ విడుదల- ధర ఎంతంటే?