ETV Bharat / business

ఈ పెంట్​ హౌస్​ ఖరీదు రూ.1300 కోట్లు!

లోధా గ్రూప్​నకు చెందిన బ్రిటన్ విభాగం 1,300కోట్లు ఖరీదు చేసే పెంట్​ హౌస్​ను విక్రయించింది. ఇంత ఖరీదైన విక్రయం ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జరగలేదని సంస్థ​ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక్కో చదరపు అడుగు దాదాపు రూ.9 లక్షలు పలికినట్లు స్పష్టం చేసింది.

lodha group pent house sold for highest price
ఈ పెంట్​ హౌస్​ ఖరీదు రూ.1300 కోట్లు!
author img

By

Published : Nov 10, 2020, 5:32 AM IST

పెంట్​ హౌస్​ అంటే మనం అపార్ట్​మెంట్ పైన ఉండే ఒక ఫ్లాట్​ అనుకుంటాం. కానీ బ్రిటన్​లో ఏకంగా 140మిలియన్​ పౌండ్లకు దాదాపు 15వేల చదరపు అడుగుల పెంట్​ హౌస్​ను.. లోధా గ్రూప్​నకు చెందిన బ్రిటన్​ విభాగం లోధా యూకే విక్రయించింది. మన రూపాయల్లో చెప్పుకోవాలంటే 1,300కోట్ల పైమాటే. ఇంత ఖరీదైన విక్రయం ఈ ఏడాది ఇప్పటిదాకా జరగలేదని లోధా గ్రూప్​ ఒక ప్రకటనలో వెల్లడించింది.

లండన్​లోని నం.1 గ్రోస్​వీనర్​ స్క్వేర్​ ఈ ధర పలికింది. ఈ ప్రాజెక్టు యునైటెడ్​ స్టేట్​ ఎంబసీకి దగ్గర్లోని మేఫెయిర్​లో ఉంది. ఒక్కో చదరపు అడుగు రూ.9 లక్షలకు విక్రయించినట్లయింది. ఈ ఏడాది విక్రయించిన అత్యంత ఖరీదైన ఇల్లు ఇది.

ఇప్పటిదాకా అమ్ముడైన టాప్​-5 ఖరీదైన ఇళ్లలో ఇదీ ఒకటిగా చేర్చొచ్చు. లండన్​లో అయితే ఇంతకంటే ఖరీదైన ఇల్లు లేదని లోధా యూకే సహా సీఈఓ గేబ్రియల్​ యార్క్​ పేర్కొన్నారు. ఒకప్పుడు అమెరికన్​ ఎంబసీ ఈ భవంతిలోనే ఉంది. అమెరికా అంబాసిడర్ హోదాలో 1785 ప్రాంతంలో జాన్​ ఆడమ్స్​(అమెరికా రెండో అధ్యక్షుడు)ఇందులోనే నివసించారు. అంతేకాదు ఇది ప్రపంచ ప్రఖ్యాత ఓవర్​ ఆఫీసుకు ప్రతిబింబంగా ఉండేది. 2014లో ఈ నం.1 గ్రోస్​వీనర్ స్క్వేర్​ను లోధా గ్రూప్ కొనుగోలు చేసింది. 39 అపార్టుమెంట్లు, అయిదు డూప్లెక్స్​లను అభివృద్ధి చేసింది .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.