ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు సిద్ధవువుతోంది(kia new car in india). త్వరలోనే KY మోడల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ వాహనాలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధి చెప్పారు(kia new car launch).
భారత్‌లో ఇప్పటికే సెల్టోస్, సొనెట్, కార్నివల్ మోడళ్లను విక్రయిస్తోంది కియా(kia india news latest). వీటికి వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక నాలుగో మోడల్ డిజైన్‌ను డిసెంబర్ 16న వెల్లడించనుంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ వాహనాన్ని(KY) వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో అందుబాటులోకి తీసుకురానుంది(kia india latest news).
తమకు ప్రపంచంలోనే భారత్ అత్యంత కీలక మార్కెట్ అని కియా ఇండియా ఎండీ, సీఈఓ తాయ్ జిన్ పార్క్ తెలిపారు. విక్రయాల్లోనే కాకుండా, ఉత్పత్తి, గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్‌గాను అనువైన ప్రదేశమన్నారు.
' కియా ఇండియా KY వాహనాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో లాంచ్ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. దీంతో భారత్‌లో మా వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరింపజేస్తాం. '
-తాయ్ జిన్ పార్క్.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతలు ఉపయోగించే ఫ్యామీలీ కార్లకు భారీ డిమాండ్ ఉన్నట్లు తమ కంపెనీ చేసిన విస్తృత పరిశోధనలో తేలిందని పార్క్ వెల్లడించారు. కేవలం 6-7 సీటింగ్ ఉండే వాహనాన్ని(kia new car 7 seater) తీసుకురావడమే తమ లక్ష్యం కాదని, ఇప్పటివరకు లేని సరికొత్త సెగ్మెంట్‌ను తీసుకురానున్నట్లు వివరించారు. ఆటోమొబైల్ రంగంలో KY గేమ్ చేంజర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త మోడల్(kia new car).. పెద్ద ప్యామిలీకి సరిపడే స్పేస్‌తో పాటు ఎస్‌యూవీలా బోల్డ్‌గా ఉంటుందని చెప్పారు.
భారత ఆటోమొబైల్ రంగంలో అతితక్కువ కాలంలోనే 3లక్షల కార్లు విక్రయించింది కియా. దేశంలో కార్యకలాపాలు చేపట్టిన రెండేళ్లలోనే ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరిపింది.
ఇదీ చదవండి: మస్క్ తెలివి.. ఒక్క ట్వీట్‌తో రూ.15వేల కోట్ల పన్ను ఆదా!