ప్రయాణికుల వాహనాల(పీవీ) విక్రయాలపై కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. జులైలోనూ పీవీల రిటైల్ విక్రయాలు 25 శాతం తగ్గి.. 1,57,373 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2019లో 2,10,377 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. వాహన డీలర్ల సంఘం-ఫాడా తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
అన్ని విభాగాల్లో కలిపి జులైలో వాహన విక్రయాలు 36.17 శాతం తగ్గి.. 11,42,633 యూనిట్లకు పడిపోయాయి. 2019 జులైలో ఈ సంఖ్య 17,92,879 లక్షలుగా ఉండటం గమనార్హం.
జులైలో విక్రయాలు ఇలా..
వాహన రకం | 2020లో | 2019లో | క్షీణత |
ద్విచక్ర వాహనాలు | 8,74,638 | 13,98,702 | 37% |
వాణిజ్య వాహనాలు | 19,293 | 69,338 | 72.18% |
త్రిచక్ర వాహనాలు | 15,132 | 58,940 | 74.33% |
ఫాడా తెలిపిన మరిన్ని వివరాలు..
- ప్రయాణికుల వాహన విభాగంలో దేశీయంగా 50.4 శాతం వాటాతో మారుతీ సుజుకీ అగ్రస్థానంలో ఉంది.
- ద్విచక్ర వాహన విభాగంలో 40.66 శాతం మార్కెట్ వాటాతో హీరో తొలి స్థానంలో నిలిచింది.
- వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా 46.29 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో ఉంది.
- గత ఏడాదితో పోలిస్తే వాహన రిజిస్ట్రేషన్లు జులైలో భారీగా తగ్గాయి. ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే మాత్రం.. రిజిస్ట్రేషన్లు కాస్త మెరుగయ్యాయి.
ఇదీ చూడండి:బిలియనీర్ల జాబితాలో తొలిసారి టిమ్ కుక్