ETV Bharat / business

గ్యాస్ సిలిండర్‌ ధర రూ.10 తగ్గింపు

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోతున్న వేళ ఎల్​పీజీ సిలిండర్​పై రూ.10ను తగ్గించింది కేంద్రం. అటు... విమాన ఇంధన ధరలను సైతం 3 శాతం తగ్గించాయి చమురు మార్కెటింగ్​ సంస్థలు.

Jet fuel price cut by 3 pc and rs 10 drop on domestic cylinder
సిలిండర్‌పై రూ.10 తగ్గింపు
author img

By

Published : Apr 1, 2021, 10:21 AM IST

అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివస్తున్న వేళ దేశీయ చమురు సంస్థలు వినియోగదారులను కరుణిస్తున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మూడు దఫాలు స్వల్పంగా తగ్గించాయి. తాజాగా గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.10 తగ్గిస్తున్నట్లు బుధవారం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌కు రాయితీ వినియోగదారులు, మార్కెట్‌ ధరకు కొనేవారు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రూ.819కు బదులు రూ.809 చెల్లిస్తే చాలని బుధవారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది. బంగాల్​లో‌ రెండో దఫా పోలింగ్‌కు ముందు రోజు ఎల్‌పీజీ ధర తగ్గింపు ప్రకటన వెలువడడం గమనార్హం.

'ఆసియా, ఐరోపాల్లో కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండడం, టీకా దుష్ప్రభావాలపై ఆందోళనల కారణంగా గత నెల ద్వితీయార్థం నుంచి అంతర్జాతీయంగా చమురు ధరల్లో తగ్గుదల నమోదవుతోంది. ఈ కారణంగా దేశంలో చిల్లర విక్రయాలకు సంబంధించి పెట్రోల్‌పై లీటర్‌కు 61 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 60 పైసల మేర ధర దిగివచ్చింది' అని ఐఓసీ వివరించింది.

మరింత తగ్గుతాయి:

ఇటీవలి కాలంలో దేశీయంగా రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) ధరలు.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మరింత దిగివచ్చే అవకాశముందని ఓ ఉన్నతాధికారి బుధవారం చెప్పారు. ఇప్పటికే మూడు దఫాలు పెట్రో ధరలు తగ్గించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

విమాన ఇంధన ధరల్లోనూ..

విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్​) ధరలు తగ్గాయి. కిలో లీటర్​ ఏటీఫ్​ ధరను మూడు శాతం తగ్గిస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గింపుతో దేశ రాజధానిలో ఏటీఎఫ్ కిలోకు రూ.1,887(3 శాతం) తగ్గి.. రూ.58,374.16 చేరింది. ఫిబ్రవరిలో వరుసగా నాలుగు సార్లు పెరిగిన ఏటీఎఫ్​ ధరలు.. గడిచిన రెండు నెలల్లో తగ్గడం ఇదే ప్రథమం.

ఇవీ చదవండి: విమాన సంస్థలకు షాక్​.. ఏటీఎఫ్ ధరలు పైపైకి

విమాన ప్రయాణాలు మరింత ప్రియం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.