ETV Bharat / business

వేసవి కల్లా ఎగరనున్న జెట్‌ విమానాలు - jet airways updates

వేసవి నాటికి జెట్​ ఎయిర్​ వేస్ కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి. యూఏఈకి చెందిన మురళీ లాల్‌ జలాన్‌, లండన్‌కు చెందిన కల్రాక్‌ క్యాపిటల్‌ల కన్సార్షియం ఈ విషయాయన్ని స్పష్టం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుజ్జీవానికి బిడ్‌ను ఈ కన్సార్షియమే గెలుచుకుంది.

jet airways to fly before summer
వేసవి కల్లా ఎగరనున్న జెట్‌ విమానాలు
author img

By

Published : Dec 8, 2020, 7:55 AM IST

వచ్చే ఏడాది వేసవి కల్లా జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు పునః ప్రారంభిస్తామని యూఏఈకి చెందిన మురళీ లాల్‌ జలాన్‌, లండన్‌కు చెందిన కల్రాక్‌ క్యాపిటల్‌ల కన్సార్షియం స్పష్టం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుజ్జీవానికి బిడ్‌ను ఈ కన్సార్షియమే గెలుచుకుంది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ఇతర నియంత్రణపరమైన అనుమతులతో పాటు, డీజీసీఏ, పౌర విమానయాన శాఖ నుంచి స్లాట్లు, ద్వైపాక్షిక రద్దీ హక్కుల కోసం ఈ కన్సార్షియం వేచిచూస్తోంది. ఒక్కసారి విమాన కార్యకలాపాలు మొదలయ్యాక సరకు రవాణా సేవలను సైతం మొదలు పెట్టాలని ఆ కన్సార్షియం భావిస్తోంది.

కన్సార్షియం దాఖలు చేసిన పునరుజ్జీవ ప్రణాళికకు కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌ (సీఓసీ) అక్టోబరులోనే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్‌ 17 నుంచి ద్రవ్యలభ్యత సంక్షోభం కారణంగా జెట్‌ కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం విదితమే. ‘పునరుజ్జీవ ప్రణాళిక ప్రకారం.. భారత్‌లో ఇదివరకు కార్యకలాపాలు నిర్వహించిన అన్ని స్లాట్లలో తిరిగి కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నాం. అంతర్జాతీయ కార్యకలపాఆలు పునః ప్రారంభిస్తాం. ‘ద జెట్‌ 2.0’ పథకం కింద మళ్లీ పునర్వైభవాన్ని పొందాలన్నదే లక్ష్యం. అన్నీ సవ్యంగా జరిగి అనుమతులు లభిస్తే 2021 వేసవి కల్లా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆకాశానికి ఎగురుతుంద’ని కన్సార్షియం ఒక ప్రకటనలో పేర్కొంది.

అంతక్రితంలాగే దిల్లీ, ముంబయి బెంగళూరుల్లో హబ్‌లు ఉంటాయని.. టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో సబ్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని పునరుజ్జీవ ప్రణాళిక ప్రతిపాదించింది. అదే సమయంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో అంతర్జాతీయ సమాజానికి భారత్‌ కీలకంగా మారడంతో, సరకు రవాణా సేవలను సైతం పెంచాలని కన్సార్షియం భావిస్తోంది.

జనవరి 31 కల్లా అన్ని రిఫండ్‌లు

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో రద్దయిన విమానాలకు సంబంధించిన రిఫండ్‌లన్నిటినీ 2021 జనవరి 31 కల్లా చెల్లించనున్నట్లు ఇండిగో సోమవారం ప్రకటించింది. ఇప్పటికే రూ.1000 కోట్ల వరకు రిఫండ్‌లు చేసినట్లు.. ఇది వినియోగదార్లకు తాము చెల్లించాల్సిన మొత్తంలో 90 శాతానికి సమానమని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మార్చి చివర్లో విమాన కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ కారణంగా అవరోధం ఏర్పడింది. మాకు నిధుల ప్రవాహం ఆగిపోవడంతో రద్దయిన విమానాలకు సంబంధించిన రిఫండ్‌ ప్రక్రియను తక్షణం చేయలేకపోయాం. ఇపుడిపుడే విమాన ప్రయాణానికి గిరాకీ స్థిరంగా పెరుగుతోంది. అందుకే 100 శాతం రిఫండ్‌లను జనవరి 31, 2021కల్లా పూర్తి చేస్తామ’ని ఇండిగో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రోనోజాయ్‌ దత్తా వెల్లడించారు.

ఇదీ చూడండి: 'ఐఎంసీ'లో నేడు ప్రధాని మోదీ ఉపన్యాసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.