ETV Bharat / business

ఈ-కామర్స్​ రంగంలోకి "చెక్​అవుట్​"తో ఇన్​స్టాగ్రాం

ఈ-కామర్స్​ రంగంలోకి అడుగుపెట్టనుంది ఫేస్​బుక్​ అనుబంధ సంస్థ ఇన్​స్టాగ్రామ్. కొత్తగా చెక్​ అవుట్ అనే ఆప్షన్​ అందుబాటులోకి తెస్తోంది ఇన్​స్టాగ్రామ్​.

author img

By

Published : Mar 20, 2019, 3:26 PM IST

ఇన్​స్టాగ్రామ్

ఈ-కామర్స్​ రంగంలోకి ఫేస్​బుక్​ అనుబంధ సంస్థ ఇన్​స్టాగ్రామ్​ అడుగుపెట్టనుంది. దీనికోసం యాప్​లో కొత్తగా 'చెక్​అవుట్​' ఆప్షన్​ను అందుబాటులోకి తెస్తోంది. దీనితో వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు.

"ఇన్​స్టాగ్రామ్​లో కొత్తగా చెక్​అవుట్​ ఆప్షన్​ను ప్రవేశ పెట్టాం. ఇకపై మీకు నచ్చిన వస్తువులు,యాప్​లోనే కొనుగోలు చేయొచ్చు" -ఫేస్​బుక్​ , సిలికాన్​ వ్యాలీ శాఖ.

ఈ చెక్​అవుట్​ ఆప్షన్​ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించి అమెరికాలో బీటా వర్షన్​ యాప్​ను పరిశీలిస్తున్నారు.

ఎలా పనిచేస్తుంది:

చెక్​ అవుట్​ బటన్​ మీద క్లిక్​ చేసి మనకు కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవచ్చు. వాటి సైజు, రంగు ఎంచుకుని తర్వాత చెల్లింపులు జరిపే విధంగా దీనిని తీర్చిదిద్దారు.

ఇంతకు ముందు ఇన్​స్టాలో కనిపించే వస్తువులను వాటి వెబ్​సైట్​ లింకుల ఆధారంగా కొనుగోళ్లు జరిపేవారు. ఇప్పుడు చెక్​అవుట్ ఆప్షన్​​ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అ అవసరం ఉండదని ఫేస్​బుక్​ వర్గాలు తెలిపాయి.

సమాచారం భద్రపరుస్తాం:

మొదటిసారి కొనుగోలు జరిపేటప్పుడు మనం ఇచ్చిన సమాచారాన్ని భవిష్యత్​ అవసరాల కోసం భద్రపరచనున్నట్లు తెలిపింది ఇన్​స్టాగ్రామ్​.

అయితే ఇది గతంలో ఫేస్​బుక్​ పై వచ్చిన వ్యక్తిగత వివరాల చోరి లాంటి వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. దీనికి వినియోగదారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ప్రఖ్యాత బ్రాండ్ల ఉత్పత్తులు:

అడిడాస్​, బుర్​బెర్రి, హెచ్​ అండ్​ ఎమ్​​ లాంటి ప్రఖ్యాత బ్రాండ్ల ఉత్పత్తులు ఇన్​స్టాలో లభించనున్నాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.