వారంలో తొలి రోజు నష్టాలను నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 210 పాయింట్లు కోల్పోయి 34,961 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 71 పాయింట్లు క్షీణించి 10,312 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో ఆరంభం నుంచే సూచీలపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
ఆర్థిక, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం నష్టాలకు ప్రధాన కారణం. దేశీయంగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం కూడా నష్టాలకు కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 35,032 | 34,662 |
నిఫ్టీ | 10,338 | 10,224 |
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఎం&ఎం షేర్లు లాభపడ్డాయి.
ఎస్&పీ రేటింగ్ కోతతో యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి సోమవారం 7 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 75.58 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:టిక్‌టాక్‌కు 'స్వదేశీ' సవాల్- దూసుకెళ్తున్న చింగారీ!