ETV Bharat / business

'రూ.94,000 కోట్లకు ఓటీటీ మార్కెట్​!'

author img

By

Published : Jul 19, 2021, 9:00 AM IST

2030 నాటికి దేశీయ వీడియో ఓటీటీ విపణి విలువ రూ.94,000 కోట్ల స్థాయికి చేరుతుందని ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ అంచనా వేసింది. నెట్‌వర్క్‌లు మెరుగు పడటం, డిజిటల్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమవ్వడం వల్ల ప్రస్తుతం రూ.11,000 కోట్ల స్థాయిలో ఉన్న ఈ విపణి విలువ గణనీయంగా పెరుగుతుందని చెప్పింది.

ott platforms in india
భారత్​లో ఓటీటీలు

దేశీయంగా వీడియో ఓటీటీ విపణి 2030కి రూ.94,000 కోట్ల (12.5 బిలియన్‌ డాలర్ల) స్థాయికి చేరుతుందని ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ విపణి విలువ 1.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.11,000 కోట్ల) స్థాయిలోనే ఉన్నా, నెట్‌వర్క్‌లు మెరుగు పడటం, డిజిటల్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమవ్వడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ వంటి దిగ్గజాలున్నా, స్థానిక, ప్రాంతీయ భాషా సంస్థలకు గణనీయ అవకాశాలు లభిస్తాయని వివరించింది. 2025కే 4 బిలియన్‌ డాలర్ల (రూ.30,000 కోట్ల) స్థాయికి ఈ పరిశ్రమ చేరనుందని పేర్కొంది.

ఆడియో ఓటీటీ విపణి ఎంతంటే..?

గానా, జియో సావన్‌, వింక్‌మ్యూజిక్‌, స్పోటిఫై వంటి సంస్థల ఆధిపత్యం ఉన్న ఆడియో ఓటీటీ విపణి ప్రస్తుతం 0.6 బి.డా. (సుమారు రూ.4,500 కోట్ల) స్థాయిలో ఉన్నా, 2025కు 1.1 బి.డా. (సుమారు రూ.8,250కోట్ల)కు, 2030కి 2.5 బి.డా.(సుమారు రూ.19,000 కోట్ల)కు చేరుతుందనే అంచనాను ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ వ్యక్తం చేసింది. కొవిడ్‌ పరిణామాల వల్ల ఓటీటీలకు గణనీయ గిరాకీ లభిస్తోందని పేర్కొంది. ఓటీటీ ఆదాయాల్లో చందా ఆదాయం దేశీయంగా 93 శాతమని, ప్రపంచ సగటు 87 శాతమని తెలిపింది. వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) కూడా 7.2 డాలర్లు (సుమారు రూ.540) ఉందని, 2025కు ఓటీటీ వినియోగదార్ల సంఖ్య 46.27 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

ఇదీ చూడండి: రిలయన్స్ కొత్త ఇంధన వ్యాపారం రూ.2.6 లక్షల కోట్లకు!

ఇదీ చూడండి: Gold: సగం బంగారం ఆ దేశం నుంచే వస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.