ETV Bharat / business

2021లో భారీగా పెరగనున్న నియామకాలు! - ఉపాధి అవకాశాలు

ఈ త్రైమాసికంతో పోల్చితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో.. భారత్​లో ఉద్యోగ నియామకాలు ఎక్కువగా జరుగుతాయని ఓ సర్వే స్పష్టం చేసింది. మొత్తం 1,518 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు 'మ్యాన్​ పవర్​ గ్రూప్​ సర్వే' తెలిపింది. ​

Indian employers report better hiring intentions for first quarter of 2021: Survey
2021లో భారీగా పెరగనున్న నియామకాలు!
author img

By

Published : Dec 8, 2020, 7:43 PM IST

డిసెంబర్​తో ముగియనున్న త్రైమాసికంతో పోల్చితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో భారత్​లో ఉద్యోగ నియామకాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఓ సర్వే స్పష్టం చేసింది. ఇందుకు దేశంలో కార్పొరేట్​ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కారణమని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,518 కంపెనీలపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది.

సర్వేలో వెల్లడైన అంశాలు..

  • 2021 మొదటి మూడు నెలల్లో ఉపాధి అవకాశాలు రెండు శాతం మేర పెరుగుతాయని అంచనా.
  • ఆర్థిక, బీమా, రియల్​ ఎస్టేట్​, మైనింగ్​, నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి.
  • మిగతా అన్నీ రంగాలు ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేశాయి.
  • పండుగ సమయం ప్రారంభంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంటోంది.
  • రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో నియామకాలు జోరందుకోనున్నాయి.
  • దేశంలోని 65 సంస్థలు కొవిడ్​కు ముందున్న ఉద్యోగుల సంఖ్య కంటే 44 శాతం ఎక్కువగా ఉద్యోగాలు కల్పించనున్నాయి.
  • మధ్యతరహా, భారీ పరిశ్రమల వలే చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉద్యోగార్థులను తీసుకోనున్నాయి. ఇది సానుకూల అంశం.
  • ఇటీవల లోక్​సభ ఆమోదించిన కార్మిక సంస్కరణలు బిల్లుతో.. నిరుద్యోగులకు, యాజమాన్యాలకు ప్రయోజనం చేకూరనుంది.
  • తైవాన్​, అమెరికా, సింగపూర్​ దేశాలు ఉద్యోగ కల్పనలో అధిక వృద్ధిరేటును నమోదు చేశాయి.

ఇదీ చూడండి: పండుగ డిమాండ్​తో పెరిగిన కార్ల విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.