భారత్-అమెరికా వాణిజ్య చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే చర్చలు సఫలమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ .
వాషింగ్టన్లోని ఐఎమ్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో సీతారామన్, అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్నుూచిన్లు క్లుప్తంగా వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. వచ్చే నెల ప్రారంభంలో భారత్ పర్యటనకు రానున్నారు మ్నూచిన్. ఆ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు చేపట్టాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: అమెరికా-చైనా చర్చల్లో పురోగతి .. వాణిజ్య యుద్ధం ముగిసేనా!