రాబోయే మూడు నాలుగేళ్లలో చికెన్, గుడ్ల ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని శ్రీనివాస ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలు సహా 16 రాష్ట్రాల్లో వ్యాపారం ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. త్వరలో మరో మూడు రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ చిట్టూరి వెల్లడించారు.
ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్సీ) దాదాపు రూ.130 కోట్లు తమ సంస్థలో పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పెట్టుబడులతో 20 శాతం వాటా ఐఎఫ్‌సీకి దక్కనున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలో కోడి గుడ్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న అమెరికాకు భారత్ గట్టి పోటీనిస్తుందని.. ఇందుకు కేంద్రం అందిస్తున్న సహకారం బాగుందని పేర్కొన్నారాయన.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జిల్లాలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్కు.. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.