ETV Bharat / business

వీడియోకాన్‌ కేసులో దీపక్​ కొచ్చర్​కు బెయిల్​ - దీపక్​ కొచ్చర్​కు బాంబై హై కోర్టు బెయిల్

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న దీపక్‌ కొచ్చర్​కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ సీఈఓ చందాకొచ్చర్ భర్త దీపక్​​కు గురువారం బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.‌

Bombay HC grants bail to Deepak Kochhar
దీపక్​ కొచ్చర్​కు బెయిల్​
author img

By

Published : Mar 25, 2021, 1:35 PM IST

ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ సీఈఓ చందాకొచ్చర్​ భర్త దీపక్​ కొచ్చర్​కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐసీఐసీఐ-వీడియోకాన్‌ కుంభకోణం కేసులో దీపక్ కొచ్చర్ ఇప్పటివరకు​ ఈడీ కస్టడీలో ఉన్నారు.

గత ఏడాది డిసెంబర్​లోనే బెయిల్​ కోసం దీపక్ కొచ్చర్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రత్యేక కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తర్వాత దీపక్​ కొచ్చర్​ హైకోర్టును ఆశ్రయించారు.

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలు మంజూరు చేయడంలో రూ.1,875 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని చందాకొచ్చర్‌ దంపతులపై మనీలాండరింగ్‌ చట్టం కింద గత ఏడాది సెప్టెంబర్​లో ఈడీ కేసులు నమోదు చేసింది. వారితో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్‌ దూత్‌పైనా కేసు పెట్టింది. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు చందా కొచ్చర్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించింది.

ఇదీ చదవండి:విదేశాలకు నెఫ్ట్, ఆర్​టీజీఎస్ సేవలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.