ETV Bharat / business

ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్- మాతృ భాషలోనే పరీక్ష! - ఐబీపీఎస్​ క్లర్క్ అప్లికేషన్ ఫీజు

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఐబీపీఎస్​ గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,830 క్లర్క్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? విద్యా అర్హతలు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీకోసం.

Banking jobs notification
బ్యాంకింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్​
author img

By

Published : Oct 7, 2021, 1:52 PM IST

Updated : Oct 7, 2021, 5:25 PM IST

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. అక్టోబర్​ 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొంది​. మొత్తం 5,830 పోస్టులకు గానూ ఈ నోటిఫికేషన్​ విడుదలైంది.

నిజానికి నెల క్రితమే ఈ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. వివిధ కారణాలతో ఆలస్యంగా ఈ ప్రక్రియను ప్రారంభించింది ఐబీపీఎస్​.

ఇంకో గుడ్​ న్యూస్ ఏమిటంటే.. ఈ సారి పరీక్ష ప్రాంతీయ భాషల్లోనూ ఉండనుంది. గత ఏడాది ఇంగ్లిష్​, హిందీ భాషల్లో మాత్రమే పరీక్షను నిర్వహించింది ఐబీపీఎస్​. ఆర్థిక శాఖ చొరవతో.. ఈసారి ప్రిలిమ్స్​, మెయిన్స్ రెండు పరీక్షలను 13 స్థానిక భాషల్లో నిర్వహించేందుకు సిద్ధమైంది.

క్లర్క్​ నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్​లైన్​ ద్వారా జరగనుందని ఐబీపీఎస్​ పేర్కొంది. ఎంపిక విధానం ప్రిలిమ్స్​, మెయిన్స్ పరీక్షా ఫలితాల ఆధారంగా ఉండనుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ లేదు.

అర్హతలు..

ఏదైన డిగ్రీ పట్టా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక భాషల్లో మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి ఉండాలి. కంప్యూటర్ కోర్సుకు సంబంధించి సర్టిఫికేట్​ తప్పనిసరి.

వయో పరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 2021 జులై 1 నాటికి కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా వయో పరిమితి 28 ఏళ్లు. రిజర్వేషన్​ కోటా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఇలా..

జులైలో క్లర్క్​ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని ఐబీపీఎస్​ వెల్లడించింది.

కొత్తగా అప్లై చేయాలంటే..

1. ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి

2. హోం పేజీలో 'Apply for Bank Clerks' పై క్లిక్​ చేయాలి..

3. రిజిస్ట్రేషన్​ ఆప్షన్​ పై క్లిక్​ చేసి.. అందులో అడిగిన అన్ని వివరాలు సమర్పించాలి.

4. అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపి.. కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్​ చేయాలి. ఫొటో, సంతకం, ఎడమ చేతి బొడనవేలి ముద్ర, రాతపూర్వక డిక్లరేషన్​ వంటివి స్కాన్​ చేసి అప్లోడ్​ చేయాల్సి ఉంటుంది.

5. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత.. ఓ కాపీని భవిష్యత్​ అవసరాల కోసం సేవ్​ చేసుకోవాలి.

ఫీజు ఎంత?

రిజర్వేషన్ లేని అభ్యర్థులు రూ.850 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. రిజర్వేషన్​ ఉన్న వాళ్లు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్​సైట్లో పూర్తి వివరాలను క్షణ్నంగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయడం ఉత్తమం.

ఇదీ చదవండి: టెలికాం రంగంలో 100% ఎఫ్​డీఐ- నోటిఫై చేసిన కేంద్రం

Last Updated : Oct 7, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.