ETV Bharat / business

ఎస్‌బీఐ నుంచి సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను ఎలా కొనాలి? - sovereign gold bonds scheme

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 6వ విడత సార్వభౌమ పసిడి బాండ్లు ఆగస్టు 30 నుంచి ఈ నెల 3 వరకు అందుబాటులోకి ఉండనున్నాయి. మరి ఈ బాండ్లను ఎలా కొనుగోలు చేయాలి?

Sovereign gold bonds
సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు
author img

By

Published : Sep 2, 2021, 6:15 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) గాను 6వ విడత సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు ఆగ‌ష్టు 30 నుంచి అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ బాండ్లు సెప్టెంబ‌రు 3వ‌ తేది వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. మ‌దుప‌రులు వారి డీ మ్యాట్ ఖాతాల ద్వారా గానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన ఇతర మార్గాల ద్వారా గానీ బాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

భార‌తీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్ ద్వారా సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను కొనుగోలు చేసే వీలుకల్పిస్తుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ-స‌ర్వీస్‌లో ఉన్న ఐఎన్‌బి ఆప్ష‌న్ ద్వారా నేరుగా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

ఎస్‌బీఐ ఆన్‌లైన్ పోర్ట‌ల్ ద్వారా సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను కొనుగోలు చేసే విధానం:

  • ముందుగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • ఇ-స‌ర్వీస్ ఆప్ష‌న్‌లో ఉన్న సావ‌రిన్ గోల్డ్ బాండ్‌పై క్లిక్ చేయాలి
  • ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ బాక్స్‌లో టిక్ చేసి ప్రాసీడ్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేష‌న్ ఫార‌మ్‌ను పూర్తి చేసి స‌బ్మిట్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే స‌రిపోతుంది.

గోల్డ్ బాండ్లను ఒక గ్రాము బంగారం ధరతో మొదలుకుని జారీ చేస్తారు. అంటే ఈ పథకంలో జారీ చేసే ఒక్కో బాండు ఒక గ్రాము బంగారంతో సమానం. క‌నీసం ఒక గ్రాము నుంచి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వ్య‌క్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలవారు గ‌రిష్టంగా 4 కేజీల వ‌ర‌కు, సంస్థలు 20 కేజీల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ప్ర‌యోజ‌నాలు:

ఖ‌చ్చిత‌మైన రాబ‌డి..

సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన వారు వార్షికంగా 2.5 శాతం వ‌డ్డీ రేటుతో స్థిర‌మైన రాబ‌డిని పొందవ‌చ్చు. ఈ వ‌డ్డీని ఆరు మాస‌ముల‌కు ఒక‌సారి పెట్టుబ‌డిదారుల ఖాతాలో జమ చేస్తారు. చివ‌రి ఆరు నెలల వ‌డ్డీని మొత్తం పెట్టుబ‌డితో క‌లిపి చెల్లిస్తారు.

నిల్వ చేయ‌న‌వ‌స‌రం లేదు..

భౌతిక రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే, దాన్ని నిల్వ చేయాలి. ఎక్కడ సుర‌క్షితంగా ఉంటుందో చూసుకోవాలి. కానీ ఈ బాండ్లలో అలాంటి ఇబ్బందుకు ఉండ‌వు కాబ‌ట్టి మ‌రింత భ‌ద్రంగా ఉంటాయి.

ద్ర‌వ్యత..

ఆర్‌బీఐ నోటీఫై చేసి, ఇష్యూ చేసిన 15 రోజుల లోపు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ట్రేడ్ చేయ‌వ‌చ్చు.

జీఎస్‌టీ, త‌యారీ ఛార్జీలు ఉండ‌వు..

గోల్డ్ కాయిన్‌లు, బార్లు రూపంలో కొనుగోలు చేసే బంగారంపై వ‌ర్తించే జీఎస్‌టీ సార్వభౌమ ప‌సిడి బాండ్ల‌కు వ‌ర్తించ‌దు. అయితే డిజిట‌ల్ గోల్డ్ కొనుగోళ్ళ‌పై మాత్రం, భౌతిక బంగారం మాదిరిగానే 3 శాతం జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. ఎస్‌జీబీలో త‌యారీ ఛార్జీలు కూడా ఉండ‌వు.

రుణ స‌దుపాయం..
సావరిన్ బంగారు బాండ్లు పెట్టి రుణాలను తీసుకోవ‌చ్చు. సాధార‌ణ గోల్డ్ లోన్ మాదిరిగానే లోన్-టు-వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తిని ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్ణ‌యిస్తుంది. దీని ప్ర‌కారం బాండ్ల‌ను బ్యాంకు వ‌ద్ద డిపాజిట్ చేసి రుణం తీసుకోవచ్చు.

మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను..

మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన లాభాలపై పన్ను వర్తించదు. ఈ పన్ను ప్రయోజనం ప్రత్యేకించి పసిడి పథకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. గోల్డ్ ఈటీఎఫ్,గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, భౌతిక బంగారం వంటి ఇతర పెట్టుబడులకు అందుబాటులో లేదు.

గోల్డ్ మోనిటైజేష‌న్ స్కీమ్‌ కింద నవంబ‌రు 2015లో సార్వభౌమ ప‌సిడి ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది. ఈ ప‌థ‌కం కింద భార‌త ప్ర‌భుత్వం త‌రపున రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడ‌త‌ల వారిగా బాండ్ల‌ను జారీ చేస్తుంది. 2021-22కి సంబంధించి 6వ విడత ప‌సిడి బాండ్ల గ్రాము ధ‌ర‌ను రూ. 4,732గా నిర్ణ‌యించారు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి ఇష్యూధ‌ర‌పై మ‌రో రూ.50 త‌గ్గుతుంది. అంటే ఆన్‌లైన్ ద్వారా చెల్లించే వారు రూ.4,682 కే గ్రాము విలువైన బాండ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇదీ చదవండి: హ్యుందాయ్ కొత్త కారు- పియోజియో నుంచి 5 సూపర్ బైక్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.