ETV Bharat / business

సీఎన్‌జీ కార్లతో పెట్రోల్ భారానికి చెక్​! - పెట్రోల్ డీజిల్ కార్లకు ప్రధాన ప్రత్యామ్నాయాలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. డీజిల్ ధర కూడా సరికొత్త రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. అయితే ఈ ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది విద్యుత్ వాహనాలు ఉత్తమ ప్రత్యామ్నాయాలు అనుకుంటున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాకుండా మరో ప్రత్యామ్నాయంతో కూడా ఖర్చులు తగ్గించుకునే మార్గం ఉంది. ఆ ప్రత్యామ్నాయం ఏమిటి? అనే వివరాలు మీ కోసం.

Alternative Fuels for Petrol
సీఎన్​జీ కార్లతో తగ్గనున్న పెట్రో భారం
author img

By

Published : Jul 11, 2021, 3:25 PM IST

పెట్రోల్‌ ధరలు సెంచరీ కొట్టడం వల్ల మధ్య తరగతి వ్యక్తుల జేబుకు భారీ చిల్లుపడింది. డీజిల్‌ కారుతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుంది.. ఇంజిన్‌ చప్పుడు ఉండదు.. ఎప్పుడో ఒక సారి బయటకు వెళ్లొచ్చులే అని పెట్రోల్‌ కార్లు కొనుక్కున్న వారు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. సహజంగానే డీజిల్‌తో పోలిస్తే పెట్రోల్‌ కార్ల మైలేజీ తక్కువే. దీనికి తోడు పెట్రోల్‌ ధరలు రూ.100 దాటేయడం వల్ల నిర్వహణ ఖర్చు తడిసిమోపెడైంది. నగరాల్లోని ట్రాఫిక్‌లో బంపర్‌ టూ బంపర్‌ డ్రైవింగ్‌ దెబ్బకు మైలేజీ ఘోరంగా తగ్గిపోతుంది. మైలేజీ సాధించే చిట్కాలను ట్రాఫిక్‌లో పాటించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో సీఎన్‌జీ కారు అద్భుతమైన ప్రత్యామ్నాయం.

ధర తక్కువ, మైలేజీ ఎక్కువ..

పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.104.93 (హైదరాబాద్​లో) వద్ద ఉంది. అదే కిలో సీఎన్‌జీ ధర రూ.69. ఇది పెట్రోల్‌ కంటే ఎక్కువ మైలేజీ కూడా ఇస్తుంది. ఉదాహరణకు ఆల్టో కారును తీసుకుంటే లీటర్‌ పెట్రోల్‌కు 22.05 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అదే సీఎన్‌జీ కారు మైలేజీ కేజీకి 31.59కి.మి.గా పేర్కొంది. మైలేజీలో అదనంగా తొమ్మిది కిలోమీటర్లు లభిస్తుండగా.. ధరలో రూ.35 మిగులుతున్నాయి. నెలకు 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించే వారికి సీఎన్‌జీతో ఖర్చు బాగా ఆదా అవుతుంది. దీనికి తోడు సీఎన్​జీకి రోజువారీ ధరలు నిర్ణయించే విధానం లేదు. ఏడాది మొత్తం మీద 5-6 సార్లు మారతాయి.

పర్యావరణ హానీ తక్కువే..

పెట్రోల్‌, డీజిల్‌ వలే ఇది పర్యావరణానికి హాని చేయదు. వాహనాల్లో సీఎన్‌జీ వినియోగం వల్ల కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ఉద్గారాలను 80శాతం వరకు తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయి. మిగిలిన ఉద్గారాలను సీఎన్‌జీ 45శాతం తగ్గిస్తుంది. సీఎన్‌జీ కారును పెట్రోల్‌, సీఎన్‌జీలతో నడిపించవచ్చు. ఒక వేళ సీఎన్‌జీ బంకులు అందుబాటులో లేకపోతే పెట్రోల్‌ కొట్టించుకుని ప్రయాణించవచ్చు.

సీఎన్‌జీ ఇంజిన్‌ వాడితే ఇంధన అవశేషాలు చాలా తక్కువగా వెలువడుతాయి. దీంతో కారు ఇంజిన్‌లోని పైపులు, ట్యూబులు వెంటనే దెబ్బతినే ప్రమాదం ఉండదు. ఫలితంగా ఇంజిన్‌ జీవితకాలం పెరుగుతుంది. దీంతో తరచూ సర్వీసింగ్‌లు చేయించాల్సిన సమస్య తగ్గుతుంది. ఇంధన లీకేజీ జరిగితే పెట్రోల్‌, డీజిల్‌ మాదిరిగా మిగిలిన భాగాలకు వ్యాపించి ప్రమాదకారిగా మారదు. గాలి కంటే సీఎన్‌జీ తేలిగ్గా ఉండటంతో తొందరగా వాహనం బయటకు వెళ్లిపోతుంది.

సీఎన్‌జీలో చిన్న చిన్న లోపాలు..

  • సీఎన్‌జీ 12 కేజీల సిలిండర్‌లో 85శాతం మాత్రమే నింపవచ్చు.
  • కారు పికప్‌ కొంత తగ్గొచ్చు
  • డిక్కీలో సిలిండర్‌ను అమర్చితే ఆమేరకు స్థలం అందుబాటులో ఉండదు
  • తగినన్ని సీఎన్‌జీ స్టేషన్లు లేకపోవడం
  • సీఎన్‌జీ కోసం బ్రాండెడ్‌ కిట్‌ వాడకపోతే సమస్యలు రావడం

భారత్‌లో చౌకగా లభించే 5 సీఎన్‌జీ కార్లు..

మారుతీ సుజుకీ ఆల్టో

భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్‌ ఇది. ఈ చిన్న ఎంట్రీ లెవల్‌ కారులో 0.8 లీటర్‌ ఇంజిన్‌ ఉంది.

  • సీఎన్‌జీ ఇంధనంతో 40 బీహెచ్‌పీ శక్తిని, 60 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది
  • కేజీ సీఎన్‌జీకి 31.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది
  • ఎల్‌ఎక్స్‌ఐ, ఎల్‌ఎక్స్‌ఐ(ఓ) వేరియంట్లలో లభించే ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.4.56 లక్షల నుంచి రూ.4.60 లక్షల వరకు ఉంది.

మారుతీ సుజుకీ సెలీరియో

ఆల్టోతో పోలిస్తే కొంచెం పెద్దగా ఉంటుంది. పలు అదనపు ఫీచర్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి.

  • 1.0 లీటర్‌ ఇంజిన్‌ 57 బీహెచ్‌పీ శక్తి, 78 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది.
  • కేజీ సీఎన్‌జీకి 30.47 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
  • సీఎన్‌జీ వెర్షన్‌ వీఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ (ఓ) వేరియంట్లలో లభిస్తుంది.
  • వీటి ఎక్స్‌షోరూం ధర రూ.5.85 లక్షల నుంచి రూ.5.90 లక్షల వరకు ఉంది.

మారుతీ సుజుకీ వేగనార్‌

టాల్‌బాయ్‌ సిట్టింగ్‌ డిజైన్‌లో లభించే ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని 1.0లీటర్‌ 3సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 57 బీహెచ్‌పీ శక్తి, 78 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.

  • కేజీ సీఎన్‌జీకి 32.52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
  • అత్యధిక మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ కారుగా ఇది ఘనత సాధించింది.
  • ఎల్‌ఎక్స్‌ఐ, ఎల్‌ఎక్స్‌ఐ(ఓ) మోడళ్లలో ఇది లభిస్తుంది.
  • దీని ధర రూ.5.60 లక్షల నుంచి రూ.5.67 లక్షల వరకు ఉంది.

హ్యూందాయ్‌ శాంత్రో

ఈ కారులోని మాగ్నా, స్పోర్ట్స్‌ వేరియంట్లుకు 1.2లీటర్‌ ఫోర్‌సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 60 బీహెచ్‌పీ శక్తి, 85 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.

  • అత్యధికంగా కేజీ సీఎన్‌జీకి 30.38 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుంది.
  • దీని ధర రూ.5.92 లక్షల నుంచి రూ.6.06 లక్షల మధ్య ఉంటుంది.

హ్యూందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌

  • ఈ కారు 1.2లీటర్‌ ఇంజిన్‌తో వస్తుంది.
  • 69బీహెచ్‌పీ శక్తి, 95 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
  • కేజీ సీఎన్‌జీకి 28.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
  • ధర రూ.6.84 లక్షల నుంచి రూ.7.38 లక్షల వరకు ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.