జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా భారీగా కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లకు వినియోగించిన ఫ్యూయల్ పంప్స్‌లో సమస్యలు తలెత్తడంతో వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 7,61,000 వాహనాలను ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. వీటిల్లో హోండాతోపాటు దాని అనుబంధ సంస్థ అక్యూరా వాహనాలు కూడా ఉన్నాయి. 2018 నుంచి 2020 మధ్య తయారైన వాహనాలు వీటిలో ఉన్నాయి. ఈ సమస్య కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగలేదని.. ముందు జాగ్రత్తల్లో భాగంగానే రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ మోడళ్లు వెనక్కు..
అకార్డ్,సివిక్,సీఆర్-వీ,ఫిట్,పైలట్,రిడ్జ్‌లైన్,ఎండీఎక్స్,ఆర్డీఎక్స్,టీఎల్‌ఎక్స్ మోడల్ కార్లు వీటిలో ఉన్నాయి. గత డిసెంబర్‌లో కూడ సాఫ్ట్‌వేర్ సమస్యలు, డ్రైవ్ షిఫ్ట్‌ల్లో సమస్యలతో అమెరికాలో దాదాపు 14లక్షల కార్లను హోండా రీకాల్ చేసి సమస్యను పరిష్కరించింది. అప్పట్లో కూడా పలు లగ్జరీ మోడళ్లు వీటిలో ఉన్నాయి.
ఇవీ చదవండి: బెంజ్ కార్లలో లోపం- 6.6 లక్షల యూనిట్లు రీకాల్