మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి నెలవారీగా దాఖలు చేసే జీఎస్టీఆర్-3బీ చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలస్య రుసుమును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. చెల్లించాల్సిన మొత్తాలపై వడ్డీరేటును కూడా తగ్గించినట్లు తెలిపింది.
రూ.5కోట్ల టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జీఎస్టీఆర్-3బీని దాఖలు చేయడానికి 15 రోజుల అదనపు సమయాన్ని ఇచ్చింది. సాధారణంగా అయితే ఈ పక్షం రోజులకు 9శాతం ఆలస్య రుసుముని కేంద్రం వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ పై 18శాతం ఆలస్య రుసుమును కట్టాల్సి ఉంటుంది.
అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) విడుదల చేసింది. తాజాగా తీసుకున్న పన్ను మినహాయిపులు ఏప్రిల్ 18 నుంచి చేసిన వాటికి వర్తిస్థాయని తెలిపింది. ఏప్రిల్ సేల్స్ రిటర్న్ జీఎస్టీఆర్-1ను దాఖలు చేయవలసిన తేదీని మే 26 వరకు పొడిగించారు.
ఇదీ చూడండి: ఐటీఆర్ దాఖలుకు గడువు పొడిగింపు