విద్యుత్ సవరణ బిల్లు- 2021ను ప్రభుత్వం ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే విద్యుత్ వినియోగదారులు టెలికాం సేవల మాదిరిగానే తమకు నచ్చిన సర్వీసు ప్రొవైడర్ నుంచి విద్యుత్‌ను పొందవచ్చు.
ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదంపై గత జనవరిలోనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత సభ ముందుకు తీసుకురానున్నారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే.. ఈ రంగంలో ఉండే సంస్థల మధ్య పోటీ పెరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులు బరిలో ఉంటారు. వినియోగదారులు వారికి నచ్చిన సర్వీస్ ప్రొవైడర్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం, ప్రస్తుత పంపిణీ సంస్థ నిర్ణీత ప్రాంతానికి పరిమితం కాదు. అలానే ఒకే ప్రాంతంలో ఉన్న వారు బహుళ పంపిణీ సంస్థల నుంచి సేవలు పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం సూచించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ చేసే కంపెనీలు ముందుగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిషన్‌లో నమోదు చేసుకోవాలి. ఇదంతా 60 రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: విద్యుత్ చట్ట సవరణలు మాకు ఆమోదయోగ్యం కాదు!