ETV Bharat / business

ఎఫ్​డీఐ పాలసీకి కేంద్రం సవరణ!

ఎఫ్​డీఐ పాలసీలో సవరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీపీసీఎల్​లో 49 శాతానికి మించి షేర్లు కొనుగోలు చేసేందుకు విదేశీ సంస్థలకు వీలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

bharat petroleum, ఎఫ్​డీఐ పాలసీపై కేంద్రం
ఎఫ్​డీఐ పాలసీకి కేంద్రం సవరణ!
author img

By

Published : May 28, 2021, 11:47 AM IST

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవస్థ (ఎఫ్​డీఐ)లో కేంద్రం సవరణలు చేయనున్నట్లు సమాచారం. దేశంలోనే రెండో అతిపెద్ద అయిల్​ కంపెనీ అయిన భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​ (బీపీసీఎల్​)లో అత్యధిక షేర్ల కొనుగోలుకు విదేశీ పెట్టుబడిదారులకు వీలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం సంబంధిత శాఖలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.

కేంద్రం విక్రయించనున్న 52.98 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రముఖ మైనింగ్​ కంపెనీ వేదాంత సహా అపోలో గ్లోబల్​ మేనేజ్​మెంట్​ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవస్థలో ఓ విదేశీ సంస్థ పెట్రోలియం సంస్థల్లో 49 శాతానికి మించి పెట్టుబడులు పెట్టకూడదు అనే నిబంధన ఉంది. కేంద్రం ఇప్పుడు దీనిని తొలగించి.. సంస్థల్లో వంద శాతం పెట్టుబడులకు అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.

ఇదీ చదవండి : కరోనా ఉత్పత్తులపై నేడు జీఎస్​టీ మండలి నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.