వినియోగదారుల కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనితో ఇకపై మీ మొబైల్ రీఛార్జ్... గూగుల్ సెర్చ్‌లోనే చేసుకోవచ్చు. డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి కూడా తెలుసుకోవచ్చు.
ఎలా చేయాలంటే..
ఆండ్రాయిడ్ యూజర్లు ముందుగా మీ ఫోన్లో డీఫాల్ట్‌గా ఉన్న గూగుల్ యాప్‌లో 'సిమ్ రీఛార్జ్' అని టైప్ చేయాలి. అప్పుడు మొబైల్ రీఛార్జ్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో మీ మొబైల్ నెంబర్, ఆపరేటర్, సర్కిల్ వంటి వివరాలు నింపి, కింద ఉండే బ్రౌజ్ ప్లాన్స్‌పై క్లిక్ చేయాలి.
అప్పుడు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్లు అన్నీ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోవాలి. దీని తరువాత మీరు పేమెంట్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు గూగుల్ పే, మొబిక్విక్, పేటీయం, ఫ్రీఛార్జ్ లాంటి పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో దేని మీదైనా క్లిక్‌చేస్తే... మీ ఫోన్లో సంబంధిత యాప్‌కు, లేదా దానికి సంబంధించిన వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీ పేమెంట్ పూర్తిచేయవచ్చు.
ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే
ప్రస్తుతం ఈ సౌలభ్యం కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వినియోగదారులు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. త్వరలోనే ఎంటీఎన్ఎల్ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది గూగుల్.
వీరి కోసం..
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏటంటే.. ఈ ఫీచర్లన్నీ ఇప్పటికే గూగుల్ పే యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే గూగుల్ పే, పేటీయం లాంటి యాప్‌ల్లో అందరూ రిజిస్టర్ చేసుకోలేరు కనుక అలాంటి వారికి ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది.
ఇదీ చూడండి: స్టాక్‌మార్కెట్ల లాభాల జోరుకు కళ్లెం