బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛ మైన బంగారం ధర నేడు రూ.95 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,460కి చేరింది.
దేశీయంగా డిమాండు లేమితో పసిడి ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలపడుతుండటమూ పుత్తడి ధరల తగ్గుదలకు మరో కారణంగా తెలుస్తోంది.
బంగారంతో పాటే వెడి ధర నేడు క్షీణించింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.128 తగ్గి.. రూ.44,607కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,463 డాలర్లకు వద్దకు చేరింది. వెండి ఔన్సుకు 16.62 డాలర్ల వద్ద ఉంది.