బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.38 పెరిగి రూ.39,892గా ఉంది. కిలో వెండిపై ధర రూ.21 పెరిగి రూ.47,781గా ఉంది.
రూపాయి విలువ తగ్గుదలతో..
రూపాయి విలువ స్వల్పంగా తగ్గడమే బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. ఇంట్రాడేలో రూపాయి విలువ 11 పైసలు పతనమై, ఒక డాలరుకు రూ.71.33గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,520 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 17.85 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: అంతర్జాతీయ సానుకూల పవనాలతో.. లాభాలు