బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర మంగళవారం (Gold price today) రూ.89 దిగొచ్చి.. రూ.46,167 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించడం.. దేశీయంగా బంగారం ధరలు తగ్గేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
కిలో వెండి ధర (దిల్లీలో) కూడా (Silver price today) రూ.222 తగ్గి.. రూ.67,926 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం (Gold price in International market) ధర 1,774 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 26.02 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లోని(Gold prices in Telugu states).. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,360 వద్ద, వెండి ధర కిలో రూ.70,212 వద్ద ఉన్నాయి.
ఇదీ చదవండి:ఎస్బీఐ షాక్- ఖాతాదారులపై ఛార్జీల మోత