ETV Bharat / business

పసిడి కాస్త ప్రియం- దిగొచ్చిన వెండి

దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో అతి స్వల్పంగా రూ.60 పెరిగింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.66,550 దిగువకు చేరింది.

Gold price rise again
పెరిగిన బంగారం ధర
author img

By

Published : Mar 17, 2021, 4:02 PM IST

బంగారం ధర బుధవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా..రూ.60 పెరిగి రూ.44,519 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి డిమాండ్​కు అనుగుణంగా దేశీయంగానూ బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి క్షీణత కూడా ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది.

వెండి ధర మాత్రం కిలోకు (దిల్లీలో) రూ.200 దిగొచ్చింది. కిలో ధర ప్రస్తుతం రూ.66,536 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,735 డాలర్లకు పెరిగింది. వెండి ధర 26 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:మార్కెట్ల బేజారు- 50వేల దిగువకు సెన్సెక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.