ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.266 వృద్ధితో.. రూ.41,484కి చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ నేడు స్వల్పంగా తగ్గడం కారణంగా పసిడి ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
వెండి ధర మాత్రం నేడు కిలోకు రూ.55 (దిల్లీలో) తగ్గి.. రూ.46,630 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్సు బంగారం ధర 1,574.5 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సుకు 17.64 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:ఫేస్బుక్లో జోరుగా 'నకిలీ' దందా- 27.5కోట్ల ఖాతాలు ఫేక్