అంతర్జాతీయంగా పసిడి ధరలు పుంజుకోవటం, రూపాయి మారకపు విలువ తగ్గటం వల్ల నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.455 పెరిగి రూ. 41,610కి చేరుకుంది.
మరోవైపు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దిల్లీలో కిలో వెండి ధర రూ.1,283 తగ్గి రూ. 40,304కు చేరింది.
"రూపాయి మారకపు విలువ తగ్గుదల, అంతర్జాతీయంగా బంగారం ధరలు పుంజుకోవటం వల్ల 24 క్యారెట్ల బంగారం దిల్లీలో రూ. 455 పెరిగింది. నేడు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 36పైసలు క్షీణించింది."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, సీనియర్ విశ్లేషకులు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 1,539 డాలర్లుకు చేరుకుంది. వెండి ఔన్సుకు 15.65 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.