బంగారం ధర(Gold Price today) స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.200 తగ్గింది. పసిడి బాటలో పయనించిన వెండి(Silver price today).. కిలోకు రూ.100 దిగొచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.50,570 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,840 వద్ద ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.50,570గా ఉంది. కిలో వెండి ధర రూ.67,840 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.50,570గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,840 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,845.85డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 24.65 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
- హైదరాబాద్లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
- గుంటూరు నగరంలో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.
ఇదీ చూడండి: cryptocurrency news: ఇక 'క్రిప్టో' ఆదాయంపైనా పన్ను- త్వరలో చట్టం!