బంగారం ధర శుక్రవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి స్వల్పంగా రూ.65 పెరిగి.. రూ.49,551 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగానూ బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.298 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.61,232 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ.. ఔన్సు బంగారం ధర 1,868 డాలర్లకు పెరిగింది. వెండి ధర స్వల్పంగా పెరిగి.. ఔన్సుకు 24.15 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:'రూ.62,600 కోట్లు కట్టాలి.. లేదంటే రాయ్ అరెస్ట్'