బంగారం ధర శుక్రవారం స్వల్పంగా రూ.94 తగ్గింది. దీనితో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.52,990 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గడం వల్ల ఆ ప్రభావం దేశీయంగా పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర మాత్రం శుక్రవారం కిలోకు రూ.782 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,262 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,938 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు 27.19 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.