బంగారం ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ.80 తగ్గి.. రూ.39,719కి చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి కాస్త పుంజుకోవడం వల్ల బంగారం ధరలు తగ్గినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా పసిడికి డిమాండు తగ్గడం మరో కారణంగా చెబుతున్నారు.
వెండి ధర నేడు భారీగా తగ్గింది. కిలోకు (దిల్లీలో) రూ.734 క్షీణతతో.. రూ.35,984 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,483 డాలర్లుగా ఉండగా.. వెండి ఔన్సుకు 12.53 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:'రాబడులు పెంచుకునే యోచనలో కేంద్రం'