బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.357 తగ్గి.. రూ.50,253 వద్దకు చేరింది.
రూపాయి విలువ పెరుగుతుండటం, పసిడిపై పెట్టుబడులు తగ్గుతుండటం వంటి పరిణామాలు.. బంగారం ధర తగ్గేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.532 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,639 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,882 డాలర్లకు పెరిగింది. వెండి ధర స్వల్పంగా పెరిగి ఔన్సుకు 24.57 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత ఆసక్తి