ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి బుధవారం రూ.26 తగ్గి.. రూ.51,372 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతుండటం వల్ల ఆ ప్రభావం దేశీయంగా పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కిలోకు స్వల్పంగా రూ.201 తగ్గి... కిలో ధర ప్రస్తుతం రూ.62,241 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,887 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్సుకు 22.70 డాలర్లకు తగ్గింది.
ఇదీ చూడండి:మీడియా, వినోద రంగానికి 2021-22లో కొత్త కళ!