పసిడి, వెండి ధరలు శుక్రవారం దిగొచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.342 తగ్గి.. రూ.47,599 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ బంగారం ధరలు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కిలోకు (దిల్లీలో) భారీగా రూ.2,007 దిగొచ్చింది. కిలో ధర ప్రస్తుతం రూ.67,419 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,760 డాలర్లకు తగ్గింది. వెండి ధర 26.78 డాలర్లకు చేరింది.
ఇదీ చదవండి:దలాల్ స్ట్రీట్ ఢమాల్- సెన్సెక్స్ 1939 పాయింట్లు డౌన్