బంగారం ధర సోమవారం రూ.195 తగ్గింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50,449 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గడం వల్ల.. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కూడా సోమవారం భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.933 క్షీణించి.. రూ.59,274కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,857 డాలర్లకు దిగొచ్చింది. ఔన్సు వెండి ధర స్వల్పంగా తగ్గి 23.70 డాలర్ల వద్ద ఉంది.