బంగారం ధర శుక్రవారం స్వల్పంగా రూ.102 కు తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,594 వద్దకు చేరింది.
పసిడి బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ.16 తగ్గి, ప్రస్తుత ధర రూ.62,734 వద్దకు చేరింది.
అమెరికాలో ఉద్దీపనల పథకాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తుండటం వల్ల ఈ ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,836 డాలర్లకు తగ్గింది. వెండి ధర 23.92 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:మళ్లీ లాభాలు- 46వేల మార్క్ దాటిన సెన్సెక్స్