తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rate Today)భారీగా తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే రూ.300 మేర తగ్గి.. పది గ్రాముల మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.49,386 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర (Silver price today)రూ. 928 మేర తగ్గి.. 66,482 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా...
- హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,371 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,478కి చేరింది.
- విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,368 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ.66,485 వద్ద కొనసాగుతోంది.
- విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,369గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,483 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయంగా...
అంతర్జాతీయంగానూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1789 డాలర్లుగా ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.06 డాలర్లు పలుకుతోంది.
చమురు ధరలు ఇలా...
రెండు రోజుల విరామం తర్వాత భారత్‌లో చమురు సంస్థలు మరోసారి ఇంధన ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 35 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) ప్రకటించాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.94కు చేరగా.. డీజిల్ ధర రూ.96.68కు ఎగబాకింది.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.112.23కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్‌కు రూ.105.42 కి చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్‌కు రూ.114.24కి చేరింది. డీజిల్‌పై 36 పైసలు పెరిగి లీటర్ రూ.106.82 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.98 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.60కి చేరింది.
ఇదీ చూడండి: ఫోన్‌పేలో యూపీఐ లావాదేవీలు ఉచితమే.. కానీ...