స్టాక్ మార్కెట్లపై ఈ వారం ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ మార్కెట్లు, స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం కీలకంగా ఉండనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశాల ఆధారంగా విదేశీ, దేశీయ మదుపరుల స్పందన మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నట్లు చెబుతున్నారు.
'అమెరికా ఫెడ్ తదుపరి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు మార్కెట్లపై కీలకంగా ప్రభావం చూపే అవకాశముంది. తక్కువ వడ్డీ రేట్లను, హై లిక్విడిటీకి ప్రాధాన్యతనిస్తూ ఫెడ్ నిర్ణయం తీసుకుంటే.. అది మార్కెట్లకు కలిసొచ్చే అంశం' అని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు.
వీటన్నింటితో పాటు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మదుపరులు ప్రధానంగా దృష్టిసారించొచ్చని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.
రూపాయి కదలికలు, కరోనా వైరస్ సంబంధిత వార్తలు మార్కెట్లను ప్రభావవితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చదవండి:'మహిళా సాధికారత కోసం 'హెర్ సర్కిల్''