ETV Bharat / business

'ప్రపంచ ఆర్థిక రథం రివర్స్ గేర్- 1% పతనం!'

ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించే అవకాశమున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం(డీఈఎస్​ఏ) అంచనా వేసింది. ముందుగా అంచనా వేసిన 2.5 శాతం వృద్ధికి కరోనా వైరస్​ రూపంలో ఎదురుదెబ్బ తలిగినందున ప్రపంచ వృద్ధి.. 0.9 శాతం పతనమవనుందని లెక్కగట్టింది.

Global economy could shrink by almost 1% in 2020 due to COVID-19 pandemic: UN
కరోనా దెబ్బ-ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకశాతం పతనం!
author img

By

Published : Apr 2, 2020, 1:15 PM IST

కరోనా మహమ్మారి కారణంగా 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు ఒకశాతం మేర క్షీణించే అవకాశమున్నట్లు ఐక్యరాజ్యసమితి విశ్లేషించింది. గతంలో ఇదే ఏడాదికి గానూ 2.5 శాతం వృద్ధిని అంచనా వేసిన యూఎన్​.. తాజాగా వైరస్ ప్రభావంతో పతనం తప్పదని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ఉద్దీపనలు ప్రకటించకుండా.. వివిధ దేశాలు ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు కొనసాగిస్తే ఈ నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశాలూ ఉన్నాయని హెచ్చరించింది.

ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం(డీఈఎస్​ఏ) చేసిన ఈ విశ్లేషణలో.. ప్రపంచ సరఫరాతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి కొవిడ్​-19 ఆటంకంగా మారిందని వెల్లడైంది. కరోనా కారణంగా గత నెలలో దాదాపు 100 దేశాలకు పైగా జాతీయ సరిహద్దులను మూసివేశాయని, ప్రపంచవ్యాప్తంగా పర్యటక రంగం స్తంభించిపోయిందని డీఈఎస్​ఏ పేర్కొంది.

" ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఉద్దీపనలు ప్రకటించేందుకు ముందుకు రావట్లేదు. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదముంది. 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 0.9 శాతం మేర క్షీణించే అవకాశముంది."

- ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం(డీఈఎస్​ఏ)

1.2శాతం వృద్ధి లేదా 0.9శాతం నష్టం

ప్రస్తుతం వేగంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రెండు రకాలుగా అంచనా వేసింది డీఈఎస్​ఏ.

" ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతుల్లో మిత క్షీణత, జీ-7 దేశాలతో పాటు చైనాలో ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమంగా 1.2శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశముంది.

పరిస్థితి మరీ చేయిదాటిపోతే... వివిధ రంగాల్లో చైనా, జపాన్​, దక్షిణ కొరియా, అమెరికా, ఐరోపా సమాఖ్య​ దేశాల్లో డిమాండ్​ తగ్గుదల, ప్రామాణిక ధరతో పోల్చితే ముడిచమురు ధరలు 50 శాతం క్షీణత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ముందుగా అంచనా వేసిన 2.5 శాతం వృద్ధికి బదులు 0.9 శాతం నష్టపోయే సూచనలున్నాయి."

- డీఈఎస్​ఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.