పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా రిటర్ను దాఖలు చేయడానికి గడువు పొడిగించింది కేంద్రం. 2018- 19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువును జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.
ఆధార్- పాన్ అనుసంధానం..
ఆధార్‌తో పాన్ అనుసంధానం గడువును కూడా పొడిగించింది కేంద్రం. 2021 మార్చి 31 వరకు అవకాశాన్ని కల్పించింది. వీటితో పాటు 2019-20 లో ఐటీ చట్టం ప్రకారం తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి వివిధ పెట్టుబడుల కాలపరిమితిని జూలై 31, 2020 వరకు పొడిగించింది.
2019- 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్ను దాఖలు గడువును నవంబర్ 30 వరకు పొడిగించినట్లు ఇప్పటికే ప్రకటించింది సీబీడీటీ.