ETV Bharat / business

జొమాటో ఐపీఓ.. వచ్చే నెల సెబీకి దరఖాస్తు? - జొమాటో పబ్లిక్ ఇష్యూ

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఐపీఓకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సెబీకి ప్రతిపాదన పంపేందుకు ముసాయిదా తయారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 650 మిలియన్‌ డాలర్లు సేకరించే అవకాశం ఉందని వెల్లడించాయి.

Zomato IPO
జొమాటో ఐపీఓ
author img

By

Published : Mar 20, 2021, 2:27 PM IST

ఆన్‌లైన్‌ ఆహార సేవల సంస్థ జొమాటో తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సెబీకి పంపాల్సిన ప్రతిపాదనల ముసాయిదా సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం.

సెప్టెంబరు ఆఖరు కల్లా ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని.. ఇష్యూ సైజు, తేదీ, ధరల శ్రేణి వంటి విషయాలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 650 మిలియన్‌ డాలర్లు సేకరించే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనిపై స్పందించడానికి జొమాటో నిరాకరించింది.

2021 ప్రథమార్థంలో తొలి ఐపీఓకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ 2020 సెప్టెంబరులోనే వెల్లడించారు. ఈ మేరకు తమ ఫైనాన్స్‌, లీగల్‌ బృందాలు కసరత్తు చేస్తున్నాయని ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో తెలిపారు.

ఇదీ చదవండి: '2021లో భారత వృద్ధి రేటు 12 శాతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.