దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ). దేశ వ్యాప్తంగా భారీగా వెలుగు చూస్తోన్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ కానీ.. పాక్షిక లాక్‌డౌన్‌ను కానీ విధించొద్దని తెలిపింది. గతేడాది విధించిన లాక్డౌన్లతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని పేర్కొంది. ఈ తరుణంలో లాక్డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకుంటే అవి ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చుతాయని ఫిక్కి లేఖలో వివరించింది.
కొవిడ్‌పై విజయం సాధించాలంటే లాక్డౌన్ అనే నిర్ణయం సరైనది కాదన్నారు ఫిక్కీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్. ప్రత్యామ్నాయంగా టెస్టులను సంఖ్యను పెంచడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేయడం ఉత్తమమని సూచించారు.
"మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రజలు కరోనా నుంచి దూరంగా ఉండొచ్చు. పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే వలంటీర్ల మద్దతు తీసుకోవాలి. కొవిడ్ ఆంక్షలను పాటించని వారిపై తగు జరిమాన విధించాలి."
- ఉదయ్ శంకర్, ఫిక్కీ అధ్యక్షుడు
దేశవ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించడాన్ని మరింతగా వేగవంతం చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఫిక్కీ కోరింది. అలాగే 18-45 ఏళ్ల వారికి టీకా వేయడాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. మహమ్మారితో ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పూర్తి మద్దతును పరిశ్రమ అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.
ఇదీ చూడండి: '18-45 ఏళ్ల వారికి టీకా వేయాలి'