గూగుల్ ఫ్లాట్‌ఫాం ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీ వసూలు చేస్తామన్న ప్రకటనపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ నియమం అమెరికాలోని వినియోగదారులకే వర్తిస్తుందని తెలిపింది. భారత్‌లోని యూజర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
"ఈ ఛార్జీలు, ఫీజులు కేవలం అమెరికాకు సంబంధించినవి. భారత్‌లోని గూగుల్ పే, గూగుల్ పే బిజినెస్ అప్లికేషన్లకు ఇవి వర్తించవు."
-గూగుల్ ప్రతినిధి
రీడిజైన్ చేసిన గూగుల్ పే యాప్‌ను వచ్చే ఏడాది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ గతవారం ప్రకటించింది. ముందుగా అమెరికాలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. దీని వల్ల వెబ్ బ్రౌజర్లో తమ సేవలు నిలిచిపోతాయని వెల్లడించింది. గూగుల్ పే ద్వారా చేసే తక్షణ నగదు బదిలీలపై సంస్థ ఛార్జీలు వసూలు చేస్తుందని కథనాలు వచ్చాయి.