ఇప్పటికే కరోనా వైరస్‌ను ఎరగా చూపి, వ్యాపారం పెంచుకునేందుకు ఇచ్చే ప్రకటనలపై ఫిబ్రవరిలోనే నిషేధం విధించిన ఫేస్బుక్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌కు సంబంధించిన మాస్కుల ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించనున్నట్లు వెల్లడించింది. వ్యాపార ప్రకటనల్లో కూడా మాస్కులకు సంబంధించిన సమాచారం ఉండకూడదని స్పష్టం చేసింది.
వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు వారిని ఆందోళనకు గురిచేసి, దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వ్యాపారులు. వీటిని నిరోధించే ప్రయత్నంలో భాగంగానే మాస్కుల ప్రకటనలపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిషేధం కొన్నిరోజుల వరకు కొనసాగుతుందన్నారు.
"మా బృందాలు కొవిడ్-19 పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. మా విధానాలకు అనుగుణంగా వైరస్‌కు సంబంధించిన తాజా సమాచారం ఫేస్బుక్లో పొందుపరుస్తాం"
-రాబ్ లెదర్న్, ఫేస్బుక్ ఉత్పత్తి నిర్వహణ అధికారి.
మాస్కులు వద్దు...
మాస్కులను కొనడం ఆపేయ్యాలని ప్రజలకు అమెరికా ప్రజారోగ్య అధికారులు సూచించారు. మాస్కులు వైరస్‌నుంచి రక్షణ కల్పించేంత సమర్థవంతంగా లేవని, అనారోగ్యంగా ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనాపై వదంతుల వ్యాప్తికి ఫేస్బుక్ అడ్డుకట్ట